CPS Employees: సీపీఎస్ రద్దుకు కమిటీని నియమించండి
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:53 AM
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసే దిశగా 6 నెలల కాల వ్యవధితో కమిటీని నియమించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితిప్రజ్ఞ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాత పింఛను పునరుద్ధరణ చేసే దిశగా...
సీపీఎస్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసే దిశగా 6 నెలల కాల వ్యవధితో కమిటీని నియమించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితిప్రజ్ఞ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాత పింఛను పునరుద్ధరణ చేసే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుని రెండున్నర లక్షల మంది ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరామని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. రాబోయే 60 సంవత్సరాల్లో ప్రభుత్వానికి, ఉద్యోగులకు జరిగే ఆర్థిక నష్టాన్ని, పాత పింఛను పునరుద్ధరణ వల్ల ప్రభుత్వానికి, ఉద్యోగులకు కలిగే మేలును వివరిస్తూ నివేదిక అందజేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చొరవ తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ నివేదికను ఉపసంఘం చైర్మన్ భట్టి విక్రమార్కకు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..