Share News

Hyderabad: సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకోవద్దన్నందుకు పీఎస్‌లో గిరిజన మహిళా నేత నిర్బంధం

ABN , Publish Date - Jul 04 , 2025 | 05:28 AM

సివిల్‌ వివాదంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ ప్రశ్నించిన పాపానికి.. సీపీఐ నేత, గిరిజన సంఘం మహిళా నాయకురాలిని ఐదు గంటల పాటు పోలీసులు పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు.

Hyderabad: సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకోవద్దన్నందుకు పీఎస్‌లో గిరిజన మహిళా నేత నిర్బంధం

  • దాదాపు 5 గంటలపాటు స్టేషన్‌లోనే బాధితురాలు

సైదాబాద్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): సివిల్‌ వివాదంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ ప్రశ్నించిన పాపానికి.. సీపీఐ నేత, గిరిజన సంఘం మహిళా నాయకురాలిని ఐదు గంటల పాటు పోలీసులు పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. విషయం తెలిసిన గిరిజన సంఘాలు పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగాయి. బాధితురాలి వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ శివారు సైదాబాద్‌ సింగరేణి కాలనీ బస్తీకి చెందిన శివలాల్‌ తన బంధువైన మైఖేల్‌ వద్ద రెండేళ్ల క్రితం రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. అప్పు పత్రాన్ని మైఖేల్‌ భార్య పేరున రాయించారు. కొద్దినెలల అనంతరం మనస్పర్థలు ఏర్పడి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. శివలాల్‌ అప్పు తిరిగి చెల్లించేందుకు సిద్ధం కాగా.. మైఖేల్‌, అతడి భార్య డబ్బులు తనకే అంటే తనకే ఇవ్వాలంటూ బెదిరించసాగారు. ఈ క్రమంలో మైఖేల్‌ భార్య శివలాల్‌పై పీఎ్‌సలో ఫిర్యాదు చేసింది.


ఎస్సై సాయికృష్ణ.. శివలాల్‌ను పిలిచి మైఖేల్‌ భార్యకు డబ్బులివ్వాంటూ బెదిరించారు. విషయం తెలుసుకున్న సేవాలాల్‌ బంజారా సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సక్రీబాయి గురువారం ఉదయం శివలాల్‌ను తీసుకుని పీఎస్‌కు వెళ్లారు. సివిల్‌ వివాదంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించిన మహిళా నేతను ఎస్సై సాయికృష్ణ దుర్బాషలాడుతూ పోలీ్‌సస్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. ఈ విషయం మధ్యాహ్నం వెలుగులోకి రావడంతో సేవాలాల్‌ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మోతీలాల్‌నాయక్‌తో పాటు భారీ సంఖ్యలో గిరిజన సంఘాల నేతలు చేరుకుని పోలీ్‌సస్టేషన్‌ ముందు ఽబైఠాయించారు. ఎస్సై సాయికృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సైదాబాద్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి హామీ ఇవ్యడంతో వారు శాంతించారు.

Updated Date - Jul 04 , 2025 | 05:28 AM