Share News

CPI: సజ్జనార్‌ ముఖ్యమంత్రా లేక మంత్రా..?

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:03 AM

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ముఖ్యమంత్రా లేక మంత్రినా..? ఓ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

CPI: సజ్జనార్‌ ముఖ్యమంత్రా లేక మంత్రా..?

  • ఆర్టీసీ కార్మికుల పట్ల భయానక వాతావరణం సృష్టిస్తే ఊరుకోం: కూనంనేని

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ‘ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ముఖ్యమంత్రా లేక మంత్రినా..? ఓ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు కావచ్చు.. ఆర్టీసీ కార్మికుల పట్ల భయానక వాతావరణం సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం మఖ్ధూంభవన్‌లో మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. కార్మికుల పట్ల సజ్జనార్‌ తీరు మార్చుకోకపోతే ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యేక ఉద్యమాలు చేయాల్సి వస్తుందన్నారు.


‘ఈ నెల 30న సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ రవీంద్రభారతిలో ఉంటుంది. సెప్టెంబరు 11 నుంచి 17 వరకు తెలంగాణ వారోత్సవాలు నిర్వహిస్తాం. డిసెంబరు 26న కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం’ అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని.. కాంగ్రెస్‌, సీపీఎంలతో పొత్తులేని చోట ఒంటరిగా బరిలో నిలుస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Aug 29 , 2025 | 05:03 AM