Share News

Court Issues Stay On Land Removal: గోపన్‌పల్లి ఎన్‌జీఓ హౌసింగ్‌ సొసైటీ భూములపై స్టే

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:46 AM

భాగ్యనగర్‌ తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి చెందిన భూమిగా

Court Issues Stay On Land Removal: గోపన్‌పల్లి ఎన్‌జీఓ హౌసింగ్‌ సొసైటీ భూములపై స్టే

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగర్‌ తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి చెందిన భూమిగా పేర్కొంటున్న 17 ఎకరాలను నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి పరిధిలోని సర్వే 36 ఏఏ, 36ఈ లోని 17 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో తొలగించడంపై ఆ హౌసింగ్‌ సొసైటీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ భూములపై స్టేటస్‌ కో ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ నిషేధిత జాబితాలో నుంచి తొలగించడం చెల్లదని పేర్కొంది. వాదనలు విన్న జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం.. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.

Updated Date - Aug 10 , 2025 | 04:47 AM