Share News

Congress: సత్వరమే ‘స్థానిక’ ఎన్నికలు జరపాలి

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:33 AM

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ బలోపేతం కావాలంటే త్వరితగతిన స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిందేనంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఆ పార్టీ ఎంపీలు, కంటెస్టెడ్‌ ఎంపీలు, వివిధ కార్పొరేషన్లు, సంస్థల చైర్మన్లు స్పష్టం చేశారు.

Congress: సత్వరమే ‘స్థానిక’ ఎన్నికలు జరపాలి

  • అప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం

  • మీనాక్షికి స్పష్టం చేసిన కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ బలోపేతం కావాలంటే త్వరితగతిన స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిందేనంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఆ పార్టీ ఎంపీలు, కంటెస్టెడ్‌ ఎంపీలు, వివిధ కార్పొరేషన్లు, సంస్థల చైర్మన్లు స్పష్టం చేశారు. అలాగే నామినేటెడ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, గ్రామ స్థాయి నుంచి డీసీసీ స్థాయి వరకూ కమిటీల ఏర్పాటునూ పూర్తి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో లక్షన్నర మంది వరకు పార్టీ నేతలు, కార్యకర్తలకు పదవులు లభిస్తాయని.. కమిటీలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీతో లక్షలాది మంది నేతలు, కార్యకర్తలు కొత్త బాధ్యతలు చేపడతారని వివరించారు. దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీ పుంజుకుంటుందని, ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను చురుకుగా ప్రజల్లోకి తీసుకెళ్తారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ బలోపేతంపై వరుస సమీక్షలు జరుపుతున్న మీనాక్షి.. ఆదివారం హైదరాబాద్‌లోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీ ఎంపీలు, కంటెస్టెడ్‌ ఎంపీలు, వివిధ కార్పొరేషన్లు, సంస్థల చైర్మన్లతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.


అయితే సైద్ధాంతిక పునాదులపై పార్టీ నిర్మాణం జరగాలని ఈ సందర్భంగా పలువురు చెప్పారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో స్పందన ఎలా ఉందని.. అవి వారికి చేరుతున్నాయా అని మీనాక్షి నేతలతో ఆరా తీయగా.. పూర్తిస్థాయిలో పథకాలు అందకపోవడంతో ప్రజల్లో కొంతమేర అసంతృప్తి నెలకొందని పలువురు చెప్పినట్లు తెలిసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం ప్రజలకు తెలియజేయడంతో ఆ అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరలేదని చెప్పినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన పార్టీ అభ్యర్థులను.. ఓటమికి గల కారణాలను మీనాక్షి అడిగి తెలుసుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు బీజేపీకి భారీ ఎత్తున బదిలీ కావడం వల్లే తాము ఓడామని వారు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థి ఎవరంటూ పార్టీ ఎంపీలు, కంటెస్టెడ్‌ ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లను మీనాక్షి ఆరా తీశారు. కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎక్కడెక్కడ ప్రత్యామ్నాయంగా ఉన్నాయని అడిగారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ, దక్షిణ తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయంగా ఉన్నాయని సదరు నేతలు చెప్పినట్లు తెలిసింది.


ఇవి కూడా చదవండి

తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..

మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Updated Date - Jun 02 , 2025 | 05:33 AM