Share News

Jubilee Hills: కాంగ్రెస్‌కు మరో ఉప పరీక్ష

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:39 AM

జూబ్లీహిల్స్‌లోనూ పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. దానికి అనుగుణంగా వ్యూహరచనకూ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి హైదరాబాద్‌ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు.

 Jubilee Hills: కాంగ్రెస్‌కు మరో ఉప పరీక్ష

నాడు లాస్య.. నేడు మాగంటి

ఎమ్మెల్యేల మృతితో ఉప ఎన్నికలు

ఇద్దరూ బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులే

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్‌ అకాల మరణంతో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. అయితే కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల పరీక్షలో నెగ్గిన అధికార కాంగ్రెస్‌ పార్టీ.. జూబ్లీహిల్స్‌లోనూ పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. దానికి అనుగుణంగా వ్యూహరచనకూ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి హైదరాబాద్‌ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌.. ఆ తర్వాత కాంగ్రె్‌సలో చేరారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున సికింద్రాబాద్‌ నుంచి పోటటీ చేసి, ఓటమిపాలయ్యారు. అదే సమయంలో.. ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచి.. బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ సీటును కైవసం చేసుకోవడం అప్పట్లో కాంగ్రె్‌సకు పెద్ద ఊరటనిచ్చింది. జూబ్లీహిల్స్‌ సీటునూ గెలుచుకుని హైదరాబాద్‌లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి మజ్లిస్‌ అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తోంది. మజ్లిస్‌ సహకారంతో జూబ్లీహిల్స్‌ సీటును సునాయాసంగా కైవసం చేసుకోవచ్చునన్న అంచనాతో కాంగ్రెస్‌ పెద్దలు ఉన్నారు. అయితే.. ఇక్కడి నుంచి అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గం నేతను దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా.. యాదవ సామాజిక వర్గ నేత పేరునూ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 07:06 AM