Share News

Hyderabad: రేవంత్‌.. కేటీఆర్‌ జాన్‌ జబ్బలు

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:56 AM

సీఎం రేవంత్‌రెడి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇద్దరూ జాన్‌ జబ్బలు (ప్రాణమిత్రులు) అయ్యారని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

Hyderabad: రేవంత్‌.. కేటీఆర్‌ జాన్‌ జబ్బలు

  • కేసీఆర్‌ కుటుంబాన్ని కేసుల నుంచి కాపాడుతున్నదే రేవంత్‌

  • హెచ్‌సీయూ భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా?: సంజయ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇద్దరూ జాన్‌ జబ్బలు (ప్రాణమిత్రులు) అయ్యారని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ నిర్వహించిన డీలిమిటేషన్‌ సమావేశానికి ఇద్దరూ కలిసి వెళ్లడంతోనే సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ రహస్య మైత్రి బట్టబయలైందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయాలని సవాల్‌ చేశారు.


ఈ విషయమై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసే దమ్ము బీఆర్‌ఎ్‌సకు ఉందా? అనే సంగతి కేటీఆర్‌ తేల్చుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి, అక్రమ కేసుల్లో కేసీఆర్‌ కుటుంబం అరెస్ట్‌ కాకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే ఆ కేసులను నీరు గారుస్తోందన్నారు. దానికి ప్రతిఫలంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతో కలిసి భూముల దోపిడీకి కేటీఆర్‌ సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Updated Date - Apr 09 , 2025 | 03:56 AM