CM Revanth Reddys Election Case : సీఎం రేవంత్‌రెడ్డిపై ఎన్నికల కేసు కొట్టివేత
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:39 AM
సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల సందర్భంగా
మరో కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
హైదరాబాద్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల సందర్భంగా ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ ఉప ఎన్నికల సందర్భంగా అనుమతి లేకుండా పొనుగోడులో ఎన్నికల సభ నిర్వహించారని పేర్కొంటూ అప్పటి కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులపై గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆధారాలులేకుండా తప్పుడు కేసు పెట్టారని, ఏ2గా ఉన్న తనపై కేసు కొట్టేయాలని పేర్కొంటూ సీఎం రేవంత్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ పెట్టిన సెక్షన్లకు తగిన నేరం జరిగినట్లు నిరూపణలేదని పేర్కొంది. ఈమేరకు రేవంత్‌రెడ్డిపై కేసు కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా కొవిడ్ నిబంధనలతోపాటు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా 2,500 మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారని పేర్కొంటూ 2021లో హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యే కేసుల మేజిస్ర్టేట్ కోర్టులో రేవంత్‌రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.