CM Revanth Reddy Busy Schedule: నాలుగు రోజులు బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Sep 22 , 2025 | 08:22 AM
రేపు(మంగళవారం) సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తారు. సమ్మక్క-సారలమ్మల ప్రాంగణం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై చర్చిస్తారు. ఇక 24వ తేదీన రేవంత్ రెడ్డి పాట్నా వెళ్లనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు(సోమవారం)నుంచి నాలుగు రోజుల పాటు బిజీబిజీగా గడపనున్నారు. ఈ నాలుగు రోజులు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి నాలుగు రోజుల షెడ్యూల్ ఏంటంటే.. ఈ ఉదయం10:30 గంటలకు కళింగ భవన్ పక్కన అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అగ్రసేన్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం సచివాలయం చేరుకుంటారు. ఉదయం 11:30గంటలకు జాతీయ రహదారులు, భూ సేకరణపై డిల్లీ నుంచి వచ్చే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు పురపాలక శాఖ అధికారులతో కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి, ప్రతిపాదనలపై సమీక్ష చేస్తారు. రేపు(మంగళవారం) సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తారు. సమ్మక్క-సారలమ్మల ప్రాంగణం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై చర్చిస్తారు. ఇక 24వ తేదీన రేవంత్ రెడ్డి పాట్నా వెళ్లనున్నారు. పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 25వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ఇవి కూడా చదవండి
పబ్లిక్‌లో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ముద్దులు పెట్టుకుంటూ..