Revanth Reddy: నిర్ణయాలు మీరే తీసుకుని ఫైళ్లు మా వద్దకు తెస్తే ఎలా
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:50 AM
సీఎంతోపాటు మరో మంత్రి కూడా, ‘‘అలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? సమాచారం ఇవ్వాలి కదా!’’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 5న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ ఐఏఎస్ అఽధికారిపై సీఎం రేవంత్ అసహనం
ఓ లీజు గడువు పెంచిన అధికారిపై ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 8 (ఆంఽధ్రజ్యోతి): ‘‘మీరే నిర్ణయాలు తీసుకుని.. ఫైళ్లు మా దగ్గరకు తీసుకువస్తే ఎలా? ఇది ఎంతవరకు సమంజసం?’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ ఐఏఎస్ అధికారిపై అసహనం వ్యక్తం చేశారు. సీఎంతోపాటు మరో మంత్రి కూడా, ‘‘అలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? సమాచారం ఇవ్వాలి కదా!’’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 5న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్యాబినెట్ భేటీ సందర్భంగా.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఓ పథకానికి సంబంధించిన ఫైలును ఆ శాఖ కమిషనర్ మంత్రివ ర్గం ముందు ఉంచారు. అయితే సదరు అంశం.. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అధికారి స్థాయిలో నిర్ణయం తీసుకోదగినది కాదు. అయినా ఆ అధికారి నిర్ణయం తీసుకుని.. ఆ తరువాత క్యాబినెట్ ముందుకు తేవడం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఓ ముఖ్య శాఖకు కమిషనర్‌గా, ఎండీగా, వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అఽధికారి.. ఇటీవల తన శాఖ పరిధిలోని ఒక లీజు గడువు విషయంపై నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆ శాఖ పరిధిలో ఉన్న భూములు, ఇతరత్రా ఆస్తులను లీజుకు ఇవ్వొద్దని గతం నుంచే ఉత్తర్వులు అమల్లో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఆ ఉత్తర్వులు వచ్చేనాటికి ఏవైనా భూములు లీజులో ఉంటే.. వాటి లీజు గడువు ముగియగానే ఆ భూమిని/ఇతరత్రా ఆస్తులను శాఖ స్వాధీనం చేసుకోవాలనే నిబంధన ఉన్నట్టు తెలిసింది. కానీ, ఓ లీజు గడువు ముగిసే సమయానికి స్వాధీనం చేసుకోకపోగా, ఆ లీజు గడువును పొడిగిస్తూ సదరు అధికారి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రివర్గానికి తెలియజేయకుండా.. ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండానే లీజు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, ఆ తరువాత మంత్రివర్గానికి నివేదించగా.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News