Share News

Telangana: కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

ABN , Publish Date - May 15 , 2025 | 09:40 PM

రెండు వందల కోట్లతో కాళేశ్వరం అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రీన్ చానెల్ ద్వారా నిధులిస్తామని తెలిపారు. కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Telangana: కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
Revanth Reddy

Telangana: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణీ సంగమంలో సరస్వతి పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు డి.శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ తదితరులు స్నానమాచరించి సరస్వతి నదికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్కరస్నానం చేస్తే ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నారు. సరస్వతి పుష్కరాలు తన హయాంలో రావడం సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే గోదావరి, కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయని, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను మోడల్‌గా తీసుకుంటామని ఆయన వివరించారు. రెండు వందల కోట్లతో కాళేశ్వరం అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీన్ చానెల్ ద్వారా నిధులిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలతో సరస్వతి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెంట్ సిటీ ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారన్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి కోసం వందకోట్లు కేటాయించాలని, ఆర్థిక హబ్ గా తీర్చిదిద్దాలని, రామగిరి ఖిల్లాను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దాలని వ్యాఖ్యానించారు.

అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఆంధ్రాను మరిపించేలా పుష్కరాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. నదిలో ప్లాస్టిక్ సంచులు వదలొద్దని, వచ్చే 12 రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి లక్మీకటాక్షం కావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశాన్ని ఆకర్షించేలా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేశారని అన్నారు. సరస్వతి మాత అందరికీ విద్యాబుద్దులు ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ కోరారు.


Also Read:

Picture Puzzle: మీరు జీనియస్ అయితే.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 15 సెకెన్లలో కనిపెట్టండి

Nawaz Basha: బస్సు కండెక్టర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడి

BellamKonda Srinivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌‌కు నోటీసులు

Updated Date - May 15 , 2025 | 10:09 PM