Revanth Reddy: శిబూ సోరెన్ మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:53 AM
ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శిబూసోరెన్ కుమారుడు, ప్రస్తుత ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శిబూసోరెన్ కుమారుడు, ప్రస్తుత ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజనుల సమస్యల పరిష్కారంలో మడమ తిప్పని పోరా టం చేసిన యోధుడు గురూజీ శిబూసోరెన్ అని కొనియాడారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు గురూజీ ఎప్పుడూ మద్దతు తెలిపేవారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికీ ఆయన మద్దతుదారుగా నిలిచారని గుర్తుచేశారు. ఆదివాసీ సమాజానికి ఆయన చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. శిబూసోరెన్ మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు.