క్రిప్టో కరెన్సీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - May 20 , 2025 | 04:58 AM
తక్కువ సమయంలో ఎక్కువ లాభాల పేరుతో ప్రజల్ని పెద్ద మొత్తంలో మోసం చేసిన జీబీఆర్ క్రిప్టో కరెన్సీ కేసులో మరో ఇద్దరు నిందితుల్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి) : తక్కువ సమయంలో ఎక్కువ లాభాల పేరుతో ప్రజల్ని పెద్ద మొత్తంలో మోసం చేసిన జీబీఆర్ క్రిప్టో కరెన్సీ కేసులో మరో ఇద్దరు నిందితుల్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులతోపాటు మరికొందర్ని సీఐడీ పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు.
పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం, విచారణలో లభించిన వివరాల మేరకు సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన కె. సుధాకర్, కె.రమేష్‌రెడ్డిని సీఐడీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జీబీఆర్ క్రిప్టో కరెన్సీ సుమారు 1,400 మంది నుంచి దాదాపు రూ. 95 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పట్టుబడ్డ నిందితుల్ని జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు.