Kukatpally Girl Assasination Case: ఒక్కొక్కటిగా బయటపడుతున్న బాలుడి అరాచకాలు..
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:46 PM
Kukatpally Girl Assasination Case: హత్య గురించి తెలియగానే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆధారాలు సేకరించాయి. పోలీస్ డాగ్ సంఘటన జరిగిన చోటు నుంచి నేరుగా కిందకు వెళ్లింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.
కూకట్‌పల్లి బాలిక హత్య కేసుకు సంబంధించి మతిపొగొట్టే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాలుడి నేర ప్రవృత్తి ఎలాంటిదో బయటపడింది. బాలుడిపై క్రైమ్ ఓటీటీ కంటెంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఓటీటీలో ఓ క్రైమ్ సిరీస్ చూసిన బాలుడు చోరీ, హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బాలికను హత్య చేయడానికి రెండు రోజుల ముందే అతడు ఓ పేపర్‌పై ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకున్నాడు. అందులో ఉన్న విధంగా చేయాలని నిశ్చయించుకున్నాడు.
కేక్ తినిపించిన చేత్తోనే హత్య..
నిందితుడు దొంగతనం చేసిన తర్వాత ఎలా బయటపడాలో కూడా ఓటీటీ సిరీస్ ద్వారా స్పూర్తి పొందినట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం గ్యాస్ లీక్ చేసి పరారవ్వాలని బాలుడు అనుకున్నాడు. ఈ విషయాన్ని పేపర్‌లో కూడా రాసిపెట్టుకున్నాడు. అంతేకాదు.. ఓ బుక్‌లో దొంగతనాలు, హత్యల గురించి కూడా బాలుడు రాసి పెట్టుకున్నాడు. అతడు బాలికకు బాగా తెలిసిన వ్యక్తే. బాలిక పుట్టిన రోజుకు ఆమె ఇంటికి కూడా వెళ్లాడు. నిందితుడికి బాలిక కేక్ తినిపిస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అతడు కూడా బాలికకు కేక్ తినిపించాడు. కేక్ తినిపించిన చేతి తోటే ఆమె ప్రాణం తీశాడు.
స్కూలు నుంచి అదుపులోకి..
హత్య గురించి తెలియగానే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆధారాలు సేకరించాయి. పోలీస్ డాగ్ సంఘటన జరిగిన చోటు నుంచి నేరుగా కిందకు వెళ్లింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. గత ఐదు రోజుల నుంచి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు.
ఆ బాలుడు మర్డర్ జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో ఉన్న స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. హత్య జరిగిన రోజు నుంచి అతడిపై పోలీసులకు అనుమానం ఉంది. బాలుడ్ని విచారించారు. అనుమానం మరింత పెరగటంతో శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఎస్ఓటీ, కూకట్‌పల్లి పోలీసులు దాదాపు మూడు వందల మందిని విచారించారు. వారినుంచి వివరాలు సేకరించారు.
ఇవి కూడా చదవండి
ఆగస్టు 29 నుండి జపాన్, చైనా పర్యటనకు ప్రధాని మోదీ
ఐదేళ్ల తర్వాత మళ్లీ వచ్చిన టిక్‌టాక్.. కానీ ఈసారి మాత్రం