Share News

మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలి

ABN , Publish Date - Jun 08 , 2025 | 05:18 AM

ఆపరేషన్‌ కగార్‌ పేరుతో జరుగుతున్న హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలి

ఆపరేషన్‌ కగార్‌పై న్యాయ విచారణ జరిపించాలి

పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌

నల్లకుంట, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్క్‌ ఏరియాలోని పర్సఘడ్‌ గ్రామంలో ఈ నెల 5న ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో జరుగుతున్న హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదర్‌గూడలోని ఎన్‌ఎ్‌సఎ్‌సలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.నారాయణరావు, నగర ప్రధాన కార్యదర్శి రాజారాం, కార్యవర్గ సభ్యులు పి.ఎం.రాజు, ఉపాధ్యక్షులు పి.సుదర్శన్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్‌, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు మైలారం ఆడేళు అలియాస్‌ భాస్కర్‌, ఒంటి ప్రకాష్‌, నేషనల్‌ పార్కు కార్యదర్శి దిలీప్‌, ఏరియా కార్యదర్శి సీటు రామన్న, డీసీ సభ్యుడు మున్నా, సునీత, మహే్‌షతో పాటు పదిమంది మావోయిస్టులను ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అయితే వారిని అరెస్ట్‌ చూపకుండా అదే రోజు సుధాకర్‌ను కాల్చి చంపారని, ఈ నెల 6న మైలారం ఆడేళును కాల్చి చంపారని, మిగతా వారిని తక్షణమే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్‌ చేశారు. పర్సఘడ్‌లో అరెస్ట్‌ అయిన వారిని చిత్రహింసలకు గురిచేస్తూ ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ హత్యలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నించాలని ఆయన కోరారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 05:19 AM