Share News

Chepa Prasadam 2025: నేడు, రేపు చేప ప్రసాదం.. టైమింగ్స్ ఇవే..

ABN , Publish Date - Jun 08 , 2025 | 10:02 AM

మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆది, సోమవారాల్లో బత్తిని కుటుంబసభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌..

Chepa Prasadam 2025: నేడు, రేపు చేప ప్రసాదం.. టైమింగ్స్ ఇవే..
Chepa Prasadam 2025

గోషామహల్‌, జూన్‌ 8 : మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆది, సోమవారాల్లో బత్తిని కుటుంబసభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చేతుల మీదుగా చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ కూడా హాజరయ్యారు. ఆర్‌అండ్‌బీ అధికారులు క్యూల కోసం బారికేడ్లతో పాటు ప్లడ్‌ లైట్లను ఏర్పాటు చేయగా, మత్స్యశాఖ వారు లక్షన్నరకుపైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. జీహెచ్‌ఎంసీ అధికారులు పారిశుధ్యంతో పాటు మొబైల్‌ టాయిలెట్లు, వాటర్‌వర్క్స్‌ అధికారులు మంచినీటి సరఫరాకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చే అస్తమ రోగులకు, వారి సహాయకులకు ఉచితంగా అల్పాహారం, ఆహారం, నీరు అందించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు.


రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్‌ నుంచి ఎగ్జిబిషన్‌ మైదానం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. 14 డిపోల నుంచి 140 ప్రత్యేక బస్సులు కూడా నడుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్, ఈసిఐఎల్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, దిల్‌షుఖ్‌ నగర్‌, ఎన్జీవో కాలనీ, ఉప్పల్, రాజేంద్రనగర్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ఈ బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నారు.

42 లైన్ల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు..

బత్తిని కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాలుగా 32 క్యూలైన్లు ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ యేడాది 42 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం ప్రత్యేక టోకెన్లు ఇవ్వడం జరుగుతుందని, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.


బత్తిని నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం

చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలో ఆనవాయితీ ప్రకారం శనివారం సత్యనారాయణ స్వామి వత్రం నిర్వహించారు. అక్కడి బావి నీటితో చేప ప్రసాదం తయారు చేసి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు పంపిణీ చేస్తుంటారు. సత్యనారాయణ వ్రతానికి బత్తిని కుటుంబ సభ్యులతో పలువురు నాయకులు హాజరయ్యారు.


Also Read:

సూర్యవంశీ సిక్సుల వర్షం!

వింత బహుమతి చూసి.. సిగ్గుపడిన వధువు..

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 08 , 2025 | 10:02 AM