CM Revanth Reddy: స్కిల్ యూనివర్సిటీల్లో సీవోఈలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:26 AM
రాష్ట్రంలో వీఎ్‌ఫఎక్స్, గేమింగ్ ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి..
వాటికి ఐటీఐలను అనుసంధానం చేస్తాం
కేంద్రమంత్రి జయంత్‌చౌదరితో సీఎం రేవంత్‌రెడ్డి
ఐటీఐల్లో సోలార్ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వీఎ్‌ఫఎక్స్, గేమింగ్ ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సూచించారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రిని కేంద్రమంత్రి అభినందించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసి.. దానికి ఐటీఐలను అనుసంధానిస్తామని తెలిపారు.
జాతీయ నైపుణ్య శిక్షణ కింద ఈ యూనివర్సిటీకి మద్దతివ్వాలని కేంద్ర మంత్రిని కోరగా.. తమ సహకారం తప్పక ఉంటుందని జయంత్ చౌదరి చెప్పారు. ఐటీఐలన్నింటికీ ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయాలని సీఎంకు సూచించగా.. ఐటీఐల్లో సోలార్ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను రేవంత్ ఆదేశించారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లు కాలానుగుణంగా ఐటీఐల్లో సిలబ్‌సను అప్‌గ్రేడ్ చేయాలని, ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించాలని అన్నారు.