Share News

Automatic Driving Testing: ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లకు కేంద్రం ఆమోదం

ABN , Publish Date - Mar 04 , 2025 | 04:55 AM

ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లకు కేంద్రం 30 శాతం గ్రాంట్‌ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి తెలంగాణ రవాణాశాఖలోని పలు అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇటీవల లేఖ రాశారు.

Automatic Driving Testing: ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లకు కేంద్రం ఆమోదం

మంత్రి పొన్నం లేఖకు కేంద్రమంత్రి గడ్కరీ సమాధానం

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లకు కేంద్రం 30 శాతం గ్రాంట్‌ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి తెలంగాణ రవాణాశాఖలోని పలు అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇటీవల లేఖ రాశారు. ఆ లేఖపై కేంద్ర మంత్రి గడ్కరీ స్పందించారు. ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ స్టేషన్లతోపాటు రాష్ట్రంలో కొత్తగా 3 ప్రాంతీయ డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రాష్ట్రంలో ‘వాహన్‌ సారథి’ సాఫ్ట్‌వేర్‌ సులభతరం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రవాణా శాఖలో మానవ వనరుల అభివృద్ధికి వర్క్‌షాప్‌ కం ట్రైనింగ్‌ ప్రోగ్రాం పథకాన్ని అమలు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై ఎక్స్‌ప్రెస్‌ వేలతోపాటు సుమారు 40-60 కిలోమీటర్ల వ్యవధిలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.


Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

For Telangana News And Telugu News..

Updated Date - Mar 04 , 2025 | 04:56 AM