CAT: ఐఏఎస్ శివశంకర్‌ను 2 వారాల్లో ఏపీకి పంపాలి
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:58 AM
ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు ఐఏఎస్ శివశంకర్‌ను రెండు వారాల్లో ఏపీకి పంపాలని, లేనిపక్షంలో డీవోపీటీ కార్యదర్శి జీతం నిలిపివేతకు ఆదేశాలిస్తామని కేంద్రపరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) హెచ్చరించింది.
ఇదే మీకు చివరి అవకాశం
ఆదేశాలను అమలు చేయకపోతే డీవోపీటీ కార్యదర్శి జీతం నిలిపివేతకు ఆదేశిస్తాం
కఠిన చర్యలు తీసుకుంటాం
కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు ఐఏఎస్ శివశంకర్‌ను రెండు వారాల్లో ఏపీకి పంపాలని, లేనిపక్షంలో డీవోపీటీ కార్యదర్శి జీతం నిలిపివేతకు ఆదేశాలిస్తామని కేంద్రపరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) హెచ్చరించింది. శివశంకర్‌ను ఏపీకి పంపాలన్న తమ ఆదేశాలను అమ లు చేయకపోవడంపై డీవోపీటీ(కేంద్రం)పై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించిన అధికారులు ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాలనే డీవోపీటీ ఆదేశాల నేపథ్యంలో శివశంకర్ తెలంగాణకు వచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ ఫిబ్రవరి 28న అనుమతించింది. ఆయనను తిరిగి ఏపీకే పంపాలని ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు అమలు కాకపోవడంపై కోర్టుధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు ఫిబ్రవరిలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో.. క్యాట్ ఎదుట గురువారం కోర్టు ధిక్కరణ కేసు మళ్లీ విచారణకు వచ్చింది. ఆదేశాల అమలుకు 2 వారాల గడువిస్తున్నామని.. శివశంకర్‌ను ఏపీకి పంపకుంటే డీవోపీటీ సెక్రటరీ జీతం నిలుపుదలకు ఆదేశాలివ్వడంతోపాటు.. కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వాట్సా్‌పలో జేఈఈ, నీట్ డిజిటల్ మెటీరియల్
నీట్, జేఈఈ-2026 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా‘ డిజిటల్ మెటీరి యల్‌ను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. ఇందులో 2025-26 డిజిటల్ స్టడీ మెటీరియల్ (కాన్సెప్ట్స్, మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు), 2025-2026 గ్రాండ్ టెస్టులు, సొల్యూషన్స్, ‘కోటా’ ప్రీవియస్ టెస్టులు, సొల్యూషన్స్, ర్యాంక్ బూస్టర్ టెస్టులు, ఎన్‌సీఈఆర్‌టీ నీట్ క్వశ్చన్ బ్యాంక్‌ను వాట్సాప్ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. మరింత సమాచారానికి 9849016661 నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ చేయాలని ఫోరం సూచించింది.