Share News

Janagama: యువతిపై 10 మంది సామూహిక అత్యాచారం

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:51 AM

ప్రేమ, స్నేహం పేరుతో యువతి (18)ని నమ్మించి పలువురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతికి అదే పట్టణానికి చెందిన మహమ్మద్‌ ఒవైసీ అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకున్నాడు.

Janagama: యువతిపై 10 మంది సామూహిక అత్యాచారం

  • ప్రేమ, స్నేహం పేరుతో వల వేసి అఘాయిత్యం

  • జనగామలో అమానుషం.. నిందితుల అరెస్టు

జనగామ రూరల్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రేమ, స్నేహం పేరుతో యువతి (18)ని నమ్మించి పలువురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతికి అదే పట్టణానికి చెందిన మహమ్మద్‌ ఒవైసీ అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో ఒవైసీ సహకారంతో అతడి స్నేహితులైన జనగామకు చెందిన ముత్యాల పవన్‌కుమార్‌, బొద్దుల శివకుమార్‌, అబ్దుల్‌ ఖయ్యూం, పుస్తకాల సాయితేజ, ముత్తడి సుమంత్‌రెడ్డి, గుండ సాయిచరణ్‌రెడ్డి, ఓరుగంటి సాయిరాం, నెల్లుట్లకు చెందిన నూకల రవి, పసరమడ్లకు చెందిన జెట్టి సంజయ్‌ స్నేహం పేరుతో యువతికి దగ్గరయ్యారు. ఈ ఏడాది జూన్‌లో మాట్లాడుకుందామని యువతిని ఒవైసీ అతని స్నేహితులు బయటకు పిలిపించారు.


అనంతరం ఆమెను కారులో ఎక్కించుకొని జనగామలోనే ఓ గదికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. భయపడిన యువతి విషయం బయటకు చెప్పలేదు. అనంతరం వారిలో ఓ యువకుడు యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి గోవా తీసుకెళ్లి అక్క డ కూడా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. జనగామకు తిరిగొచ్చాక బాధితురాలు తన చిన్నమ్మ సాయంతో ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారించి బాధితురాలిపై 10 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు. బుధవారం జనగామలో వారందరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 3 సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో చిరు వ్యాపారం చేసే చిన్నమ్మ సంరక్షణలో ఉంటోంది. కాగా, ప్రధాన నిందితుడు ఒవైసీ జనగామలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. నిందితులందరూ అవివాహితులే.

Updated Date - Aug 14 , 2025 | 06:59 AM