Share News

Seethakka: అవినీతి సొమ్ముతో విదేశాల్లో ‘చానళ్లు’

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:44 AM

దుబాయ్‌ సహా విదేశాల్లో పెద్ద సంఖ్యలో సోషల్‌ మీడియా చానళ్లను నెలకొల్పిన బీఆర్‌ఎస్‌.. అబద్ధాలను ప్రచారం చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారును అప్రతిష్ఠ పాలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు.

Seethakka: అవినీతి సొమ్ముతో విదేశాల్లో ‘చానళ్లు’

  • వాటితో కాంగ్రెస్‌ సర్కారుపై దుష్ప్రచారం: సీతక్క

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): దుబాయ్‌ సహా విదేశాల్లో పెద్ద సంఖ్యలో సోషల్‌ మీడియా చానళ్లను నెలకొల్పిన బీఆర్‌ఎస్‌.. అబద్ధాలను ప్రచారం చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారును అప్రతిష్ఠ పాలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన చానళ్లతో కేటీఆర్‌ రేయింబవళ్లు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. దుబాయ్‌ పర్యటనలో ఉన్న సీతక్క అక్కడ తనను కలిసిన కాంగ్రెస్‌ కార్యకర్తలతో మాట్లాడారు. కేవలం అబద్ధాలను నమ్మి బీఆర్‌ఎస్‌ రాజకీయాలను నడుపుతోందని అన్నారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కేటీఆర్‌ అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని చెప్పాడు. వాటిని ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్లి ప్రచారం చేయడంలో పార్టీ యంత్రాంగం క్రియాశీలంగా వ్యవహరించాలని కోరారు. కేరళలో కాంగ్రెస్‌ పరిశీలకురాలిగా సీతక్క చేసిన కృషిని అభినందిస్తూ కేరళ కాంగ్రె్‌సకు చెందిన ప్రవాసీ అభిమానులు ఆమెను సత్కరించారు.

Updated Date - Jun 24 , 2025 | 03:44 AM