Share News

Sama Ramamohan Reddy: రజతోత్సవ సభ కాదది.. విచ్ఛిన్న సభ!

ABN , Publish Date - May 20 , 2025 | 06:02 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ.. ఆ పార్టీ విచ్ఛిన్న సభగా మారిందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామా రామ్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Sama Ramamohan Reddy: రజతోత్సవ సభ కాదది.. విచ్ఛిన్న సభ!

  • విపక్ష నేత పదవి ఇస్తేనే కష్టపడతానన్నట్లు హరీశ్‌ వైఖరి

  • అదే జరిగితే తనకు రాజకీయ గండమేనని కేటీఆర్‌ భయం: సామా

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ.. ఆ పార్టీ విచ్ఛిన్న సభగా మారిందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామా రామ్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న హరీశ్‌రావు వైఖరి.. ప్రతిపక్ష నేత పదవి ఇస్తేనే కష్ట పడతానన్నట్లుగా ఉందన్నారు. హరీశ్‌కు ఆ పదవి ఇస్తే.. భవిష్యత్తులో తనకు రాజకీయ గండం తప్పదన్న స్పష్టత కేటీఆర్‌లో ఉందని చెప్పారు.


గాంధీభవన్‌లో మీడియాతో సామా మాట్లాడుతూ.. ‘హరీశ్‌కు ప్రతిపక్ష నేత పదవి ఇస్తే బీజేపీతో కలిసి కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్తును ఖతం పట్టిచ్చుడు ఖాయం. ఆలె నరేంద్ర నుంచి ఈటల రాజేందర్‌ వరకు నేతలను పార్టీ నుంచి కేసీఆర్‌ ఎలా పంపారో తెలిసిన హరీశ్‌.. ఆ భయంతో కేటీఆర్‌తో సంధి చేసుకుంటే.. హరీశ్‌ ఖేల్‌ ఖతం కావడమూ ఖాయం’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కుటుంబంలో కలహాలు తారస్థాయికి చేరాయని, ఎవరి ఉనికి కోసం వారు రాజకీయ చదరంగం ఆడుతున్నారన్నారు.

Updated Date - May 20 , 2025 | 06:02 AM