Share News

BRS MLA Padi Kaushik Reddy: హీరోయిన్ల ఫోన్లు హ్యాక్‌ చేయిస్తున్న రేవంత్‌: కౌశిక్‌

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:10 AM

సినీరంగ ప్రముఖులు, హీరోయిన్ల ఫోన్లను హ్యాక్‌ చేయిస్తూ వారిపై సీఎం రేవంత్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.

BRS MLA Padi Kaushik Reddy: హీరోయిన్ల ఫోన్లు హ్యాక్‌ చేయిస్తున్న రేవంత్‌: కౌశిక్‌

‘‘సినీరంగ ప్రముఖులు, హీరోయిన్ల ఫోన్లను హ్యాక్‌ చేయిస్తూ వారిపై సీఎం రేవంత్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రేవంత్‌రెడ్డి చరిత్ర నాకు పూర్తిగా తెలుసు.’’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఫోన్లు ట్యాపింగ్‌ చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. తానే ఫోన్లు ట్యాపింగ్‌ చేయిస్తున్నానని, తప్పు ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా.. అధికారులతో ఫోన్లు ట్యాప్‌ చేయిస్తున్నా.. తప్పేంటని సీఎం ప్రశ్నించారని గుర్తుచేశారు. తనఫోన్‌తో పాటు తన సతీమణి ఫోన్‌ కూడా సీఎం హ్యాక్‌ చేయిస్తున్నారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - Jul 26 , 2025 | 05:10 AM