Bonalu Festival: బహ్రెయిన్‌లో వైభవంగా బోనాలు
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:48 AM
బోనాల పండుగ ఉత్సవాలు ఒక్క జంట నగరాలకే పరిమితం కాలేదు. ఎల్లలు దాటి గల్ఫ్ అరేబియా దేశాలకు కూడా వ్యాపించాయి.
ఆకట్టుకొన్న పోతరాజులు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): బోనాల పండుగ ఉత్సవాలు ఒక్క జంట నగరాలకే పరిమితం కాలేదు. ఎల్లలు దాటి గల్ఫ్ అరేబియా దేశాలకు కూడా వ్యాపించాయి. బహ్రెయిన్‌లో శుక్రవారం తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరిగిన బోనాల పండుగలో పోతరాజులు, పెద్దపులులు, ఘటాల ఊరేగింపులు, తెలంగాణ డప్పు వాయిద్యాలు, జానపద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించగా బాలికలు, మహిళలు కలిసి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని ఆకట్టుకొన్నాయి. కాకినాడకు చెందిన శ్రీరాం బృందం చేసిన పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.