Share News

Malk Komurayya: ప్రధాన ప్రతిపక్షం బీజేపీయే అని తేలింది

ABN , Publish Date - Mar 04 , 2025 | 04:49 AM

సోమవారం కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ టీచర్‌ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమురయ్య ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న అనంతరం ఆయన్ను బండి అభినందించారు. తపస్‌ చిన్న సంస్థ అని హేళన చేసిన వారికి చెంప పెట్టులా తీర్పు వచ్చిందన్నారు.

Malk Komurayya: ప్రధాన ప్రతిపక్షం బీజేపీయే అని తేలింది

టీచర్‌ ఎమ్మెల్సీ గెలిచాం..

పట్టభద్రుల స్థానాన్ని కూడా గెలుస్తాం: సంజయ్‌

భగత్‌నగర్‌, నల్గొండ, మార్చి3(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపుతో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయే అని తేలిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ టీచర్‌ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమురయ్య ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న అనంతరం ఆయన్ను బండి అభినందించారు. తపస్‌ చిన్న సంస్థ అని హేళన చేసిన వారికి చెంప పెట్టులా తీర్పు వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కై బీజేపీ అభ్యర్థి కొమురయ్యను ఓడించాలని కుట్రలు చేశాయన్నారు. కిషన్‌రెడ్డి నాయకత్వంలో ఇది మూడో విజయమన్నారు.


ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ గెలిచామని, పట్టభద్రుల స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. ఉపాధ్యాయ స్థానంలో ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమురయ్య మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తల కృషి, తపస్‌ సహకారం వల్లే తాను గెలిచానన్నారు. ఉపాధ్యాయల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కాగా, రాష్ట్రంలో కులగణన నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీసీ, బహుజన ఐక్యత నినాదంతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, ఎస్‌.సుందర్‌రాజ్‌ బరిలో నిలిచారు. అయితే ఈ వాదాన్ని, నినాదాన్ని ఉపాధ్యాయవర్గం తేలిగ్గా తీసుకున్నట్లు స్పష్టమైంది. మాజీ ఎమ్మెల్సీ కూడా అయిన పూల రవీందర్‌ నాలుగో స్థానానికి పరిమితం కాగా, సుందర్‌రాజ్‌ ఆరో స్థానానికి పరిమితమయ్యారు.


Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

For Telangana News And Telugu News..

Updated Date - Mar 04 , 2025 | 04:49 AM