BJP: నేడో రేపో బీజేపీ రాష్ట్ర కమిటీ!
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:52 AM
బీజేపీ రాష్ట్ర కమిటీపై కసరత్తు క్లైమాక్స్‌కు చేరింది. నేడో రేపో కమిటీ ఏర్పాటు కానుంది. జాతీయ నాయకత్వం పిలుపుమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు గురువారం మధ్యాహ్నం ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లారు.
ఆగమేఘాలపై ఢిల్లీకి రాంచందర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కమిటీపై కసరత్తు క్లైమాక్స్‌కు చేరింది. నేడో రేపో కమిటీ ఏర్పాటు కానుంది. జాతీయ నాయకత్వం పిలుపుమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు గురువారం మధ్యాహ్నం ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లారు. కమిటీ సభ్యులపై ఆయన ఇప్పటికే రాష్ట్ర పార్టీ ముఖ్యులు, సీనియర్ నాయకులతో పలు దఫాలుగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటన సందర్భంగా జాబితాకు ఆయన పార్టీ అధినాయకత్వంతో ఆమోద ముద్ర వేయించుకోనున్నారని పేర్కొన్నాయి.
8 మంది ఉపాధ్యక్షులు, ఏడుగురు కార్యదర్శులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారితో కలిపి మొత్తం 19 పదవుల్లో మహిళలకు మూడోవంతు కేటాయించనున్నారు. ఈసారి బీసీలకు ఎక్కువ పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఏకంగా 26 మంది సీనియర్ నాయకులు పోటీపడుతున్నట్లు సమాచారం.