Share News

Ramchander Rao: కవితను బీజేపీలో చేర్చుకోం

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:39 AM

మ్మెల్సీ కవితను బీజేపీలో చేర్చుకోబోమని.. అవినీతిపరులకు తమ పార్టీలో స్థానం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు....

Ramchander Rao: కవితను బీజేపీలో చేర్చుకోం

  • ఆమె సస్పెన్షన్‌తో బీఆర్‌ఎస్‌ పనైపోయింది

  • వాటాల పంపకంలో తేడాతోనే పంచాయితీ

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

చిట్యాల రూరల్‌/న్యూఢిల్లీ/మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కవితను బీజేపీలో చేర్చుకోబోమని.. అవినీతిపరులకు తమ పార్టీలో స్థానం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. కవిత సస్పెన్షన్‌తో బీఆర్‌ఎస్‌ పనైపోయిందని, ఆ పార్టీలో ఉన్న నాయకులూ కారు దిగే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి, అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. దోచుకున్నదాంట్లో వాటాలు పంచుకునే వ్యవహారంలో కేసీఆర్‌ కుటుంబ పంచాయితీ బహిర్గతమైందని అన్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్‌ఎ్‌సలో అవినీతి వ్యవహారం బయటపడిందని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై 20 నెలలుగా కాంగ్రెస్‌ జాప్యం చేయడంతో ఆధారాలు తారుమారు చేసేందుకు అవకాశం దొరికిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు ఒకరికొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కేసును ముందే సీబీఐకి ఇస్తే బాగుండేదన్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ అఽధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కాంగ్రెస్‌ ప్రచారం చేసిందని.. ఇప్పుడు తెలంగాణ పరిపాలన దినోత్సవమంటూ మోసగిస్తోందని మండిపడ్డారు. నిజాం వారసులైన ఎంఐఎం నాయకులతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అంటకాగుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీశ్‌రావు, సంతోష్‌ పాత్ర ఉందని చెప్పిన కవిత.. అందుకు సంబంధించి ఆమె వద్ద ఉన్న ఆధారాలను సీబీఐకి ఇవ్వాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ బాబు సూచించారు.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Sep 03 , 2025 | 04:39 AM