Share News

Bandi Sanjay: బీజేపీకి షాక్.. బండి సంజయ్ సభకు పోలీసుల నిరాకరణ

ABN , Publish Date - Nov 06 , 2025 | 01:29 PM

కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ మీటింగ్ ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సి ఉంది. తాజాగా ఆయన మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నాయి.

Bandi Sanjay: బీజేపీకి షాక్.. బండి సంజయ్ సభకు పోలీసుల నిరాకరణ
Bandi Sanjay

హైదరాబాద్, నవంబర్ 6: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయాన్ని ఆశిస్తూ చేయనున్న ప్రచారంలో భాగంగా బోరబండలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ మీటింగ్ ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సి ఉంది. తాజాగా ఆయన మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నాయి. కాంగ్రెస్ తమపై కుట్రలు చేస్తోందని, కనీసం ప్రచారం చేసుకోనివ్వకుండా ఇలా పర్మిషన్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


అయితే తమ సభకు అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు. కచ్చితంగా సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

DGP Shivdhar Reddy DSP Training: 115 డీఎస్పీలకు ట్రైనింగ్.. ప్రారంభించిన డీజీపీ

Ant phobia: చీమల ఫోబియాతో మహిళ షాకింగ్ నిర్ణయం.. సూసైడ్ నోట్ రాసి..

Updated Date - Nov 06 , 2025 | 01:39 PM