Share News

Eatala Rajender: కమలంలో ఈటల ఇరకాటం

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:43 AM

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పీసీ ఘోష్ కమిషన్ ముందుచూపులో తెలిపారు– కార‍్యదర్శక నిర్ణయాలు, ప్రాజెక్ట్ డిజైన్లు, ఖర్చుల పెంపులు అన్నింటికీ బాధ్యత కేసీఆర్ నేతృత్వంలోని మండలి, క్యాబినెట్ తీసుకున్నదని, తన పాత్ర ఆర్థిక శాఖ సహకారంగా మాత్రమే ఉందని వాదించారు.

 Eatala Rajender: కమలంలో ఈటల ఇరకాటం

విచారణ కమిషన్‌ ముందు ఆయన వివరణపై బీజేపీలో కలకలం

అవినీతి అని పార్టీ ఆరోపిస్తుంటే.. కేసీఆర్‌ను సమర్థించేలా ఈటల మాటలు

పార్టీ లైన్‌కు, ఆ వివరణకు పొంతనే లేదు

కేసీఆర్‌ అవినీతి గురించి మాటమాత్రం విమర్శ కూడా చేయకపోవడంతో ఇబ్బంది

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన పీసీ ఘోష్‌ కమిషన్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఇచ్చిన వివరణ.. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఇరుకున పడేసిందా? కేసీఆర్‌ను వెనకేసుకొచ్చేలా ఈటల మాట్లాడారనే భావన బీజేపీ నేతల్లో కలవరం రేపుతోందా?.. అంటే అవుననే అంటున్నాయని కమలం పార్టీ వర్గాలు. బీఆర్‌ఎ్‌సను దెబ్బకొట్టేందుకు అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నట్టు అయిందని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఇన్నాళ్లుగా పార్టీ నాయకత్వం సంధించిన ఆరోపణలకు భిన్నంగా ఈటల వాదన ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.


జాతీయ నాయకత్వానికి అంతర్గత నివేదిక..

పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట శుక్రవారం హాజరైన ఈటల రాజేందర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు, అంచనాల పెంపు తదితర అంశాలపై వివరణలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈటల చెప్పిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను వెనకేసుకొచ్చేలా ఈటల మాట్లాడారంటూ అధికార కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేసింది. ఈ అంశం బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఈటల వ్యాఖ్యలు-పర్యవసానాలపై రాష్ట్ర పార్టీ ముఖ్యులు అంతర్గత నివేదిక పంపించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నాటి సీఎం కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత ఎన్నికల ముందు ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా కాళేశ్వరం కమిషన్‌ ఎదుట ఈటల మాట్లాడి ఉండాల్సింది. అంతేగాకుండా కేసీఆర్‌ అవినీతి గురించి ఈటల పల్లెత్తు మాట కూడా ప్రస్తావించకపోవడం ఇబ్బందిగా మారింది. పార్టీ లైన్‌కు, ఈటల కమిషన్‌ ఎదుట ఇచ్చిన వివరణకు సంబంధమే లేదు. క్యాబినెట్‌ నిర్ణయం మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, అలాగే టెక్నికల్‌ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగానే డిజైన్లు మార్చామని ఇచ్చిన వివరణ కేసీఆర్‌ను వెనకేసుకొచ్చేలా ఉంది’’ అని ఆ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 04:44 AM