Share News

Raja Singh: వారికి చెవులున్నా వినపడవు.. నోరున్నా మాట్లాడరు

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:23 AM

పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శిల్పాకళా వేదికలో ఆదివారం జరిగిన గవర్నర్‌ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

Raja Singh: వారికి చెవులున్నా వినపడవు.. నోరున్నా మాట్లాడరు

కిషన్‌రెడ్డిపై రాజాసింగ్‌ పరోక్ష విమర్శలు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం రేవంత్‌రెడ్డి సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా వినపడవు.. నోరున్నా చెప్పరు’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి హాట్‌ కామెంట్‌ చేశారు. పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శిల్పాకళా వేదికలో ఆదివారం జరిగిన గవర్నర్‌ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తాను కలిస్తే తెలంగాణ అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతుందని అన్నారు. ఆయన సహకరిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దీనిపై రాజాసింగ్‌ హాట్‌ కామెంట్‌ చేశారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని విమర్శించారు. అలాగే రాజాసింగ్‌ ఇటీవల ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడారు. మా వాళ్లకు మంచి ప్యాకేజీ ఇస్తే పార్టీని ఎప్పుడో బీఆర్‌ఎ్‌సలో కలిపేసేవారని అన్నారు. పార్టీ నుంచి పాత సామానును పంపించాల్సి ఉందని ఆయన అధిష్ఠానాన్ని కోరుతూ గతంలో వ్యాఖ్యానించారు. రాజాసింగ్‌కు పార్టీ నోటీసులు ఇస్తుందని ఇటీవల ప్రచారం జరగడంతో.. తనను సస్పెండ్‌ చేస్తే అందరి బాగోతం బయటపెడతానని హెచ్చరించారు. ఇలా రాజాసింగ్‌ ఏదో ఒక అంశంపై చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 04:23 AM