Ramchander Rao: మహనీయుల త్యాగాలే మార్గదర్శకం
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:57 AM
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులు, పోరాట యోధుల త్యాగాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
కొన్ని పార్టీలవి దేశ వ్యతిరేక కార్యక్రమాలు: రాంచందర్‌రావు
దేశ హితాన్ని విస్మరించి రాజకీయాలు సరికాదు:కిషన్‌రెడ్డి
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులు, పోరాట యోధుల త్యాగాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నాయని.. రైతులు, యువత ప్రయోజనాలకు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు.
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అన్నారు. కాగా, రాజకీయాలకు అతీతంగా కలసికట్టుగా పనిచేస్తేనే భారతదేశాన్ని విశ్వగురుగా మార్చగలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ హితాన్ని విస్మరించి కొందరు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.