Maheshwar Reddy: బీ ట్యాక్స్ 20 శాతానికి పెరిగింది: ఏలేటి
ABN , Publish Date - Jun 05 , 2025 | 02:53 AM
రాష్ట్రంలో 10 శాతం ఉన్న బీ ట్యాక్స్ 20 శాతానికి పెరిగిందని, అది చెల్లించకపోతే బిల్లులు ఇవ్వడం లేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో 10 శాతం ఉన్న బీ ట్యాక్స్ 20 శాతానికి పెరిగిందని, అది చెల్లించకపోతే బిల్లులు ఇవ్వడం లేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. పరిస్థితి దయనీయంగా ఉందంటూ కాంట్రాక్టర్లు తమతో మొర పెట్టుకుంటున్నారని చెప్పారు. కాలేజీలు మూతపడుతున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయరా? అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు బంగారం తాకట్టు పెట్టి పిల్లల ఫీజులు కడుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.7500 కోట్లు దాటాయన్నారు. దీంతో కాలేజీలు సహకరించక డిగ్రీ, పీజీ వార్షిక పరీక్షలు ఆలస్యంగా జరిగాయని తెలిపారు. విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ సమస్యపై క్యాబినెట్‌లో చర్చించి, ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.