Green Power Corridor: గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు అనుమతినివ్వండి
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:54 AM
గ్రీన్ ఎనర్జీ కారిడార్ కింద తెలంగాణ ట్రాన్స్ కో ప్రతిపాదనలకు అనుమతినివ్వాలని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.
కేంద్ర మంత్రి ఖట్టర్‌కు భట్టి విజ్ఞప్తి..
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): గ్రీన్ ఎనర్జీ కారిడార్ కింద తెలంగాణ ట్రాన్స్ కో ప్రతిపాదనలకు అనుమతినివ్వాలని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ మూడో దశలో సౌర విద్యుత్తు సంస్థ తొలుత ఐదు జిల్లాల్లో 13.5 గిగావాట్ల సామర్థ్యం గల గ్రీన్ పవ ర్ జోన్లను గుర్తించిందని.. ఇప్పుడు వాటి సామర్థ్యం 8 జిల్లాల్లో 19 గిగావాట్లకు విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకు రూ.6,895 కోట్లతో అంచనా వ్యయాన్ని కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థకు సమర్పించామని భట్టి వివరించారు. రాష్ట్రంలో గ్రీన్ పవర్ అభివృద్ధికి, గ్రిడ్ ఇంటిగ్రేషన్ వేగవంతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని కేంద్రమంత్రికి తెలిపారు.