Share News

Bhatti: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ రేషన్‌ కార్డు

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:51 AM

అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్‌ కార్డులు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Bhatti: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ రేషన్‌ కార్డు

  • గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక: భట్టి విక్రమార్క

ఎర్రుపాలెం, జనవరి19 (ఆంధ్రజ్యోతి): అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్‌ కార్డులు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో సోమవారం (20వ తేదీ) నుంచి గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికి అధికారులే వచ్చి సంక్షేమ పథకాలను అందజేస్తారని, ఈ నెల 26 నుంచి సంక్షేమ పథకాలు అమలవుతాయని తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకం ద్వారా రెండు దఫాలుగా రూ.12వేలు, రైతుభరోసా కింద సాగు యోగ్యమైన భూములకు రూ.15 వేలు అందిస్తామన్నారు.

Updated Date - Jan 20 , 2025 | 04:51 AM