Share News

Bhatti Vikramarka: రైతు భరోసా.. తక్కువ రోజుల్లో ఎక్కువ నిధులు!

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:00 AM

రాష్ట్ర విభజన సమయంలో మిగులు బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని అప్పగిస్తే.. గత ప్రభుత్వ పెద్దలు వారు చెప్పిన రైతుబంధు నిధులను ఏనాడు సక్రమంగా పంపిణీ చేయలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

Bhatti Vikramarka: రైతు భరోసా.. తక్కువ రోజుల్లో ఎక్కువ నిధులు!

  • గడిచిన పదేళ్లలో ఇది అరుదైన రికార్డు: భట్టి

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన సమయంలో మిగులు బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని అప్పగిస్తే.. గత ప్రభుత్వ పెద్దలు వారు చెప్పిన రైతుబంధు నిధులను ఏనాడు సక్రమంగా పంపిణీ చేయలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రైతుబంధు నిధుల మొత్తం తక్కువే అయినా.. పంపిణీకి ఒక్కో సీజన్లో 169 రోజుల చొప్పున సుమారు ఐదున్నర నెలలు పాటు సమయం తీసుకున్నారని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటనను విడుదలచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రూ.8 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌ ఉందని గుర్తుచేశారు. రైతు భరోసా కింద గత ప్రభుత్వంతో పోలిస్తే.. ఎకరాకు రూ.2 వేలు అదనంగా కలిపి రూ.12 వేల చొప్పున ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.


ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను స్వల్ప సమయంలోనే గాడిలో పెట్టినట్లు వివరించారు. తక్కువ సమయంలోనే, పెద్ద మొత్తంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. తొమ్మిది రోజుల్లో రూ. 8,744.13 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమచేసి, దేశ చరిత్రలోనే ఓ రికార్డును సృష్టించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికలకు రైతుభరోసా నిధులను వేయకుండా వెళ్ళిపోగా.. రైతుల పట్ల బాధ్యత, ప్రేమ కలిగిన కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వారు వదిలేసిన యాసంగికి సంబంధించి రూ.7,625 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.

Updated Date - Jun 26 , 2025 | 04:00 AM