Share News

బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:15 AM

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి

  • బీసీ సంక్షేమ సంఘం భేటీలో డిమాండ్‌

పంజాగుట్ట, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘స్థానిక సంస్థల ఎన్నికలు-బీసీ రిజర్వేషన్ల పెంపు, భవిష్యత్‌ కార్యాచరణ’పై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ కుందారం గణే్‌షచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడారు.


కేంద్ర ప్రభుత్వానికి కులగణపై చిత్తశుద్ధి ఉంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లు కు ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. ఢిల్లీలో చేసిన ధర్నాలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారని, కానీ అఖిలపక్షంతో ఇప్పటి వరకూ ఢిల్లీకి వెళ్లి ప్రధాని కలవకపోవడం బాధాకరమన్నారు. త్వరలో లక్షలాది మందితో బీసీల సింహగర్జన సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, టి.చిరంజీవులు తదితరులు మాట్లాడారు.

Updated Date - Jun 18 , 2025 | 05:15 AM