Share News

Basara RGUKT: ఆర్జీయూకేటీ కేటాయింపుపై సీఎంకు కృతజ్ఞతలు

ABN , Publish Date - May 30 , 2025 | 04:49 AM

బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ) ట్రిపుల్‌ ఐటీ కొత్త క్యాంప్‌సను మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేటాయించడంపై ఆ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Basara RGUKT: ఆర్జీయూకేటీ కేటాయింపుపై  సీఎంకు కృతజ్ఞతలు

  • రేవంత్‌ను కలిసిన మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు

బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ) ట్రిపుల్‌ ఐటీ కొత్త క్యాంప్‌సను మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేటాయించడంపై ఆ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం వారు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా.. జిల్లాకు కేటాయించిన ఆర్జీయూకేటీ క్యాంపస్‌ నిర్మాణానికి జూన్‌లోనే శంకుస్థాపన చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది.


శంకుస్థాపన అనంతరం భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీహరి, అనిరుధ్‌రెడ్డి, పర్ణికారెడ్డి, తూడి మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్‌ ఉన్నారు.

Updated Date - May 30 , 2025 | 04:49 AM