RSS: దేశం కోసం పుట్టిన సంస్థ ఆరెస్సెస్
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:19 AM
దేశం కోసం పుట్టిన సంస్థ ఆరెస్సెస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు చెప్పారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, ప్రధాని నరేంద్రమోదీ వంటి గొప్ప నేతలను తీర్చిదిద్దిన ఘనత ఆరెస్సె్‌సదేనన్నారు.
పాక్, చైనా కోసం మాట్లాడే పార్టీ కాదు: రాంచందర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): దేశం కోసం పుట్టిన సంస్థ ఆరెస్సెస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు చెప్పారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, ప్రధాని నరేంద్రమోదీ వంటి గొప్ప నేతలను తీర్చిదిద్దిన ఘనత ఆరెస్సె్‌సదేనన్నారు. ‘మీ మాదిరిగా చైనా, పాకిస్థాన్ ప్రయోజనాల కోసం మాట్లాడే రాజకీయ పార్టీ కాదు’ అని కాంగ్రెస్ పార్టీపై ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ దేశంలో కొన్ని పార్టీలు ఆరెస్సె్‌సపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధపు ప్రచారంతో ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మభ్య పెడుతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పేదలకు 3500 ఇళ్లు కడతామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు.. 19 నెలలు గడిచినా ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు.