Share News

Bandi Sanjay: ఇన్నాళ్లకు సొంత ఇల్లు కొన్న బండి సంజయ్‌

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:33 AM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పలుమార్లు కరీంనగర్‌లో కార్పొరేటర్‌గా గెలిచారు. అక్కడి నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు.

Bandi Sanjay: ఇన్నాళ్లకు సొంత ఇల్లు కొన్న బండి సంజయ్‌

  • రూ.98 లక్షలతో కరీంనగర్‌లో కొనుగోలు

భగత్‌నగర్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పలుమార్లు కరీంనగర్‌లో కార్పొరేటర్‌గా గెలిచారు. అక్కడి నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయ్యారు. ఆయన సతీమణి అపర్ణ బ్యాంక్‌ అధికారిగా పని చేస్తున్నారు. అయినా, ఇప్పటి వరకు సంజయ్‌కి కరీంనగర్‌లో సొంత ఇల్లు లేదు. ఆయన అత్తగారి ఇంట్లోనే ఉండే వారు. అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.


అయితే, ఇన్నాళ్లకు ఆయనకు సొంతిల్లు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. చైతన్యపురిలోని తన కార్యాలయ సమీపంలోని ఓ ఇంటిని రూ.98 లక్షలకు కొనుగోలు చేశారు. తన భార్య అపర్ణ పేరుపై రూ.85 లక్షలు బ్యాంకు రుణం తీసుకున్నారు. ఇటీవల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సోమవారం ఆయన రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను తీసుకున్నారు.

Updated Date - Jun 24 , 2025 | 04:33 AM