Share News

ఇంధన దుర్వినియోగం పేరుతో బహ్రెయిన్‌లో 9 మంది తెలంగాణవాసుల అరెస్టు

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:31 AM

ఇంధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బహ్రెయిన్‌లోని అల్‌ మోయ్యాద్‌ కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్న తొమ్మిది మంది తెలంగాణ వాసులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది.

ఇంధన దుర్వినియోగం పేరుతో బహ్రెయిన్‌లో 9 మంది తెలంగాణవాసుల అరెస్టు

  • ఆదుకోవాలని ప్రభుత్వానికి కుటుంబ సభ్యుల వినతి

బేగంపేట, జూన్‌ 17 (ఆంద్రజ్యోతి): ఇంధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బహ్రెయిన్‌లోని అల్‌ మోయ్యాద్‌ కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్న తొమ్మిది మంది తెలంగాణ వాసులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన బొమ్మిడి సుదర్శన్‌ (డ్రైవర్‌)తో పాటు మరో ఎనిమిది మంది ఈ కేసులో ఈనెల 4న అరెస్ట్‌ అయ్యారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.


వారికి న్యాయ సహాయం అందించాలని కోరుతూ సుదర్శన్‌ కుమారుడు నితిన్‌ మంగళవారం హైదరాబాద్‌లో ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌చైర్మన్‌ మంద భీంరెడ్డి, సభ్యులను కలిసి సమస్యను వివరించారు.

Updated Date - Jun 18 , 2025 | 05:31 AM