Share News

Bird Flu: కోళ్లు చనిపోతే సమాచారం ఇవ్వండి

ABN , Publish Date - Feb 16 , 2025 | 04:27 AM

రాష్ట్రంలోని పౌల్ర్టీ ఫాం బ్రాయిలర్‌ కోళ్లలో ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ లక్షణాలు అక్కడక్కడా బయటపడుతున్న నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది.

Bird Flu: కోళ్లు చనిపోతే సమాచారం ఇవ్వండి

  • నంబర్‌ను ప్రకటించిన పశుసంవర్ధక శాఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పౌల్ర్టీ ఫాం బ్రాయిలర్‌ కోళ్లలో ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ లక్షణాలు అక్కడక్కడా బయటపడుతున్న నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. అన్ని పౌల్ర్టిఫాంలపై నిఘా పెట్టాలని జిల్లాల పశుసంవర్ధక అధికారులకు శనివారం అత్యవసర ఆదేశాలు జారీచేసింది. అలాగే తమ చుట్టుపక్కల కోళ్లలో అసాధారణ వ్యాధి లక్షణాలు కనిపించినా, కోళ్లు మృతి చెందినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్థక శాఖ కమిషనర్‌ ప్రజలను కోరారు. వాట్సాప్‌ నెంబర్‌ 91007 97300కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Updated Date - Feb 16 , 2025 | 04:27 AM