Share News

జీపీఎస్‌ నిఘా ఎత్తేయాలి: ఆశా వర్కర్లు

ABN , Publish Date - Mar 07 , 2025 | 05:00 AM

తమపై జీపీఎస్‌ నిఘా ఎత్తేయాలని, నెలకు రూ. 18 వేలు స్థిర వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ధర్నాకు దిగింది.

జీపీఎస్‌ నిఘా ఎత్తేయాలి: ఆశా వర్కర్లు

హరిహరకళా భవన్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): తమపై జీపీఎస్‌ నిఘా ఎత్తేయాలని, నెలకు రూ. 18 వేలు స్థిర వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ధర్నాకు దిగింది. అనంతరం యూనియన్‌ అధ్యక్షురాలు టి.యాదమ్మ, ప్రధాన కార్యదర్శి ఎం.అనిత ఆధ్వర్యంలో యూనియన్‌ ప్రతినిధులు హైదరాబాద్‌ జిల్లా వెద్య ఆరోగ్యశాఖ డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ వెంకటికి డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. పీఎఫ్‌, ఈఎ్‌సఐ సదుపాయం, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆదివారాలు, పండుగలకు సెలవు ఇవ్వాలని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, ప్రసూతి సెలవులు, నాణ్యమైన యూనిఫాం అందజేయాలని, పని భారం తగ్గించాలని పారితోషికం లేని పనులు చేయించవద్దని వారు డీఎం అండ్‌ హెచ్‌వోకు విన్నవించింది.

Updated Date - Mar 07 , 2025 | 05:00 AM