Share News

Yadlapalli Venkateswara Rao: రైతు నేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:30 AM

రైతునేస్తం 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత డాక్టర్‌ ఐవీ సుబ్బారావు స్మారక పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి దరఖాస్తులు కోరుతూ రైతునేస్తం

Yadlapalli Venkateswara Rao: రైతు నేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

  • వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు.. వినూత్న ఆవిష్కర్తలకు ప్రదానం

  • ఆగస్టు 31లోగా పంపాలని నిర్వాహకుల ప్రకటన

హైదరాబాద్‌ సిటీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : రైతునేస్తం 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత డాక్టర్‌ ఐవీ సుబ్బారావు స్మారక పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి దరఖాస్తులు కోరుతూ రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, విస్తరణ అధికారులతో పాటు వినూత్న వ్యవసాయ ఆవిష్కరణల రూపకర్తలు... దరఖాస్తులతో పాటు వారి పరిశోధన వ్యాసాలు, సాగు అనుభవాలను జత చేసి ఆగస్టు 31లోగా ‘ఎడిటర్‌’, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ భవనం, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌-500004 చిరునామాకు పంపించాలి.


రైతునేస్తం, డోర్‌నెంబరు 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 522017 చిరునామాకు కూడా పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. పురస్కారాలకు ఎంపిక చేసిన వ్యక్తులకు సెప్టెంబరులో నిర్వహించే రైతునేస్తం వార్షికోత్సవ సభలో అవార్డులు ప్రదానం చేస్తామని వెంకటేశ్వరరావు వెల్లడించారు. మిగతా వివరాలకు 9676797777, 9705383666 నెంబర్లలో సంప్రదించవచ్చు. దరఖాస్తులను ‘రైతునేస్తం డాట్‌ ఇన్‌’ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Updated Date - Jul 13 , 2025 | 05:30 AM