Share News

Hyderabad: హైదరాబాద్‌లో అతిపెద్ద ఎక్స్‌పీరియన్షియల్ సెంటర్ ఆవిష్కరణ..

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:47 AM

భాగ్యనగరంలోని మియాపూర్‌లో అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) ఒక భారీ మెగా స్టోర్‌ను ప్రారంభించింది.

Hyderabad: హైదరాబాద్‌లో అతిపెద్ద ఎక్స్‌పీరియన్షియల్ సెంటర్ ఆవిష్కరణ..

హైదరాబాద్: భాగ్యనగరంలోని మియాపూర్‌లో అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) ఒక భారీ మెగా స్టోర్‌ను ప్రారంభించింది. అపర్ణ యూనిస్పేస్ పేరుతో ప్రారంభమైన ఈ కేంద్రం, ఆసియాలోనే గృహ రూపకల్పన, నిర్మాణాలకు సంబంధించిన అతిపెద్ద ఎక్స్‌పీరియన్షియల్ గమ్యస్థానంగా నిలిచిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జూబ్లీ హిల్స్, బెంగళూరు, విజయవాడలలో ఉన్న అపర్ణ యూనిస్పేస్ షోరూమ్‌ల నెట్‌వర్క్‌కు ఈ మెగా స్టోర్ లాంచింగ్ మరో అదనపు బలంగా నిలిచింది. తమ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయని ఏఈఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అశ్విన్ రెడ్డి తెలిపారు. పెరుగుతున్న రిటైల్ ప్రాజెక్టులు, మెట్రో, ఓఆర్ఆర్ కనెక్టివిటీ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.


భారతదేశంలో నిర్మాణ సామగ్రి మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ఈ మెగా స్టోర్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ణ రెడ్డి మాట్లాడుతూ.. కస్టమర్ల కొనుగోలు అలవాట్లు మారుతున్నందున, వారి అన్ని అవసరాలను ఒకే చోట తీర్చాలనే లక్ష్యంతో ఈ స్టోర్‌ను ప్రారంభించామని తెలిపారు. ఈ స్టోర్ 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాలకు మద్దతుగా భారతీయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని ఆమె వెల్లడించారు.

Updated Date - Sep 04 , 2025 | 04:47 AM