Share News

Alphores JEE Success: అల్ఫోర్స్‌కు ర్యాంకుల పంట

ABN , Publish Date - Apr 20 , 2025 | 02:58 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థలోని విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో పలు కేటగిరీల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. శనివారం, డాక్టర్ వి.నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించి, అడ్వాన్స్‌డ్ పరీక్షకు శిక్షణ ఇచ్చే ఉద్దేశ్యాన్ని ప్రకటించారు

Alphores JEE Success: అల్ఫోర్స్‌కు ర్యాంకుల పంట

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ కళాశాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను శనివారం ఆయన అభినందించారు. వివిధ కేటగిరీల్లో తమ విద్యాసంస్థలకు చెందిన ఎన్‌.శరణ్య 49, పి శ్రీహర్ష 244 ర్యాంకు, ఎన్‌.అనిరుధ్‌సాయి 272, డి.విశాల్‌ 329, జె.వామిక 350, టి.ప్రణతి 456, ఇ.అంకిత్‌సాయి 574, బి.ఆదిత్య 630, టి.శివాత్మిక 646, వి.హృషికేష్‌ 703, మహ్మద్‌ అబ్దుల్‌ 968తోపాటు పవార్‌ జస్పాల్‌, ఆర్‌ సుమిత్‌కుమార్‌, డి కార్తీక్‌రెడ్డి, మహ్మద్‌ గుల్షన్‌, బి.విష్ణు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. రానున్న అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంతో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 02:59 AM