Share News

Group-1 Results: గ్రూప్‌-1 ఫలితాలలో అవకతవకలు

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:31 AM

గ్రూప్‌-1 ఫలితాలలో అవకతవకలు జరిగాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌ గౌడ్‌ ఆరోపించారు.

Group-1 Results: గ్రూప్‌-1 ఫలితాలలో అవకతవకలు

  • తెలుగులో గ్రూప్‌-1 రాసిన అభ్యర్థులపై వివక్ష!

  • గ్రూపు-1 పేపర్‌ రీ వాల్యూయేషన్‌ చేయాలి

  • టాప్‌ 100లో సీఎం సామాజిక వర్గం వారే ఎక్కువ

  • తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్‌ గౌడ్‌

పంజాగుట్ట, మార్చి11(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 ఫలితాలలో అవకతవకలు జరిగాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌ గౌడ్‌ ఆరోపించారు. గ్రూప్‌-1 పరీక్షలు తెలుగులో రాసిన అభ్యర్థులపై వివక్ష చూపారని, గ్రూప్‌-1 పేపర్‌ రీ వాల్యూయేషన్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మొదటి వంద మంది ర్యాంకుల వివరాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అశోక్‌నగర్‌లోని కొన్ని కోచింగ్‌ కేంద్రాలకు సీఎంఓకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు.


టాప్‌ వందలో సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, వారికి ఆర్డీఓ, డీఎస్పీ లాంటి ఉన్నత పోస్టులు కట్టబెట్టాలని చూస్తున్నారని, ఒక్కో పోస్టుకు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఓపెన్‌ క్యాటగీరిలో ఎంపిక అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఓపెన్‌ కేటగీరీలోనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 12 , 2025 | 04:31 AM