Share News

Hyderabad: వక్ఫ్‌ సవరణకు వ్యతిరేకంగా మజ్లిస్‌ నిరసన

ABN , Publish Date - May 26 , 2025 | 04:10 AM

రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిన వక్ఫ్‌ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు

Hyderabad: వక్ఫ్‌ సవరణకు వ్యతిరేకంగా మజ్లిస్‌ నిరసన

  • కంచన్‌బాగ్‌ వద్ద పాల్గొన్న అక్బరుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిన వక్ఫ్‌ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ), మజ్లిస్‌ పార్టీల పిలుపు మేరకు హైదరాబాద్‌లో ఆదివారం పలుచోట్ల మానవ హారాలు జరిగాయి. ఇందులో పాల్గొన్న వేలాది మంది ముస్లింలు నిరసన తెలిపారు. ఒక చేత్తో జాతీయ జెండా, మరో చేతిలో నల్లజెండాలు ప్రదర్శించారు.


‘వక్ఫ్‌ బచావో దస్తూర్‌ బచావో (వక్ప్‌ను కాపాడాలి- రాజ్యాంగాన్ని కాపాడాలి)’ అన్న ప్లకార్డులతో యువకులు నినాదాలు చేశారు. కంచన్‌బాగ్‌ నుంచి చాంద్రాయణ గుట్ట వరకూ ఏర్పాటైన మానవ హారంలో అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ వక్ఫ్‌ సవరణ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

Updated Date - May 26 , 2025 | 04:10 AM