రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
ABN , Publish Date - Mar 04 , 2025 | 12:04 AM
రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని ఎమ్మెల్సీ దండె విఠల్ సూచించారు.
- ఎమ్మెల్సీ దండె విఠల్
సిర్పూర్(టి), మార్చి 3(ఆంధ్రజ్యోతి): రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని ఎమ్మెల్సీ దండె విఠల్ సూచించారు. సోమవారం మండలంలోని లోనవెల్లి గ్రామంలో ఆయన పర్యటించి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు ప్రతీ ఇంటికి చేరేలా కృషి చేయాలన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. అనంతరం బీఆర్‌ఎస్ మాజీ జడ్పీటీసీ దోని రవీందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వెంట నాయకులు ప్రేంసాగర్‌గౌడ్, గ్రామస్తులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు సిడాం గణపతి, సోహెల్ అహ్మద్, అబ్దుల్ అకీల్, కిశోర్, తదితరులు పాల్గొన్నారు.