Share News

నేడు గూడెం సత్యదేవుడి కల్యాణం

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:09 PM

మండలంలోని గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి దేవాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారి కల్యాణోత్సవానికి ఆలయం ముస్తాబైంది.

నేడు గూడెం  సత్యదేవుడి కల్యాణం
రమాసహిత సత్యనారాయణస్వామి ఉత్సవమూర్తులు

దండేపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి దేవాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారి కల్యాణోత్సవానికి ఆలయం ముస్తాబైంది. ఆదివారం సాయంత్రం గోధూళిక సముహుర్తాన వైష్టవ సంప్రదాయం ప్రకారం వేదమంత్రోచ్చరణ నడుమ కల్యాణం నిర్వహించనున్నారు. వేలాది మంది భక్తులు తరలిరానున్న నేపఽథ్యంలో అధికారులు ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అందంగా ఆలకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్‌ తెలిపారు. రూ.500 చెల్లించి కల్యాణంలో పాల్గొన్న దంపతులకు దేవస్ధానం ఆధ్వర్యంలో లడ్డు ప్రసాదం శేషవస్త్రాలు అందజేయనున్నట్లు ఈవో వెల్లడించారు. స్వామివారి కల్యాణంకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించాలని కోరారు.

Updated Date - Feb 08 , 2025 | 11:09 PM