Share News

తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:28 PM

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేయటం మానుకోవాలని, భవిష్యత్తులో పునరావృతమైతే ఊరుకునేది లేదని సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హెచ్చరించారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

- సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేయటం మానుకోవాలని, భవిష్యత్తులో పునరావృతమైతే ఊరుకునేది లేదని సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హెచ్చరించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఇక్కడే పుట్టి పెరిగానని, ఈ ప్రాంత ప్రజలు గుండెల్లో పెట్టుకొని తనను మూడుసార్లు గెలిపించారని తెలిపారు. తనను వలసవాది అంటూ అనటం సరికాదన్నారు. వాస్తవంగా బీఆర్‌ఎస్‌ నా యకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వలస వాది అని ఎద్దేవా చేశారు. పుట్టింది ఆలంపూర్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది సిర్పూరులో, మళ్లీ నాగర్‌కర్నూల్‌లో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. అయినా సిగ్గులేకుండా మళ్లీ సిర్పూరులో టూరిస్టు వ్యక్తిగా వచ్చి పోతున్నట్టు తెలిపారు. తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఇక ఊరుకునేది లేదన్నారు. తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రవీణ్‌కుమార్‌ ఆగడాలకు సంబంఽధించిన 380 వీడియోలున్నాయని, త్వరలోనే ఒక్కొక్కటి విడుదల చేస్తానిని తెలిపారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:28 PM